ఎన్టీఆర్ కథతో మహేష్ హీరోగా సినిమా ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్..?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం తో కలిసి సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా మీ 12వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా అప్పుడే విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా బరిలోకి మహేష్ సినిమా ఎందుకు అని ఈ సినిమాను వాయిదా వేయడం జరిగింది. అయితే దాని తర్వాత రాజమౌళి సినిమా కూడా వాయిదా పడడం జరిగింది.


అయితే ఈ సినిమా కూడా విడుదల కావడంతో మే నెలలో ఎట్టిపరిస్థితిలో సర్కారు వారి పాట సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్  మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడవ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అంతేకాకుండా ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు సెంటిమెంట్ ప్రకారం గురువారం పూజా కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ విషయంలో ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


అదేంటి అంటే అలా వైకుంఠపురం సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం రాసిన స్క్రిప్ట్ తోనే త్రివిక్రమ్ సినిమా చేస్తున్నట్లు ఇప్పుడు ఈ సరికొత్త వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా ఇది ఫుల్ మాస్ సబ్జెక్ట్ అని కొరటాలతో సినిమా కోసం త్రివిక్రమ్ సినిమా ఎన్టీఆర్ వదులుకోవడం తో ఇక అదే సబ్జెక్టు తో మహేష్ తో త్రివిక్రమ్ కమిట్ అయినట్లు వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు మరియు ఖలేజా సినిమాలు కమర్షియల్గా పెద్ద బ్రేక్ ఇవ్వకపోయినప్పటికి  శాటిలైట్ పరంగా టెలివిజన్ రంగంలో రికార్డులు సృష్టించడం జరిగింది. అయితే దీంతో మూడో సినిమా మహేష్ తో త్రివిక్రమ్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా పై మహేష్ బాబు అభిమానులు భారీ అంచనాలే పెట్టుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: