టెన్షన్ లో "ఎఫ్ 3" నిర్మాత దిల్ రాజు... కారణం ఇదేనా?

VAMSI
టాలీవుడ్ లో ఎందరో దర్శకులు వచ్చి తమ టాలెంట్ ను నిరూపించుకుని ఇక్కడ సత్తా చాటుతున్నారు. అదే విధంగా కొత్తగా వచ్చిన అనిల్ రావిపూడి మొదట చిన్న సినిమాలతోనే పరిచయం అయినా ఆ తర్వాత తన దర్శక టాలెంట్ తో పెద్ద నిర్మాణ సంస్థలతో సినిమాలు చేసే స్టేయికి చేరుకున్నారు. రెండు సంవత్సరాల క్రిందట అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. దాంతో ఫ్యాన్స్ ఎఫ్ 2 కి సీక్వెల్ కావాలంటూ అడిగారు... అలాగే డైరెక్టర్ కూడా ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 పట్టాలెక్కించేసారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంచెం బిజీ గా ఉంది. ఈ సినిమా విడుదల మొదట సంక్రాంతికి అనుకోగా ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 25 కు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ చివరికి ఏప్రిల్ 28 కి వాయిదా పడింది. ఇపుడు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎఫ్ 3 సినిమా ఎలా ఉండబోతున్న అంశంపై చర్చలు మొదలయ్యాయి. ఎఫ్ 2 బిగ్గెస్ట్ హిట్ అందించగా ఇపుడు ఎఫ్ 3 ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎఫ్ 2 కి మించిన ఫన్ ని మన ముందుకు తీసుకురాబోతున్నట్లు చెబుతున్నారు టీం మెంబెర్స్.

ఇక ఈ చిత్రం లో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జంటగా మెహ్రీన్ లే నటిస్తున్నారు. ఇక దర్శకుడు అనిల్ రావిపుడికి కూడా ఎఫ్ 3 మూవీ సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ డైరెక్టర్ కి అయిదు సక్సెస్ లు చేతిలో ఉండగా ఇపుడు ఎఫ్3 తో డబుల్ హ్యాట్రిక్ ను అందుకోవాలని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎఫ్ 2 మూవీ రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను రాబట్టి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి ఇపుడు అదే తరహాలో ఎఫ్ 3 కూడా ఫలితాన్ని అందుకుంటుంది ఆశిస్తున్న నేపథ్యం లో ఏమౌతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: