పవన్ అభిమానులు ఊపిరి పీల్చుకునే వార్త!!

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకునే వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా ఫస్ట్ కాపీ ను చూసిన పవన్ ఈ చిత్రం పట్ల ఎంతో సంతోషంగా ఉండటం నిజంగా పవన్ అభిమానులను సంతోషానికి గురి చేస్తోంది అని చెప్పవచ్చు. సాగర్ చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను తెరపై చూడాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేది దగ్గర పడుతుండటం వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.

అయితే ఓ కొత్త దర్శకుడితో పవన్ లాంటి హీరో సినిమా చేయడం నిజంగా ఎన్నో విమర్శలకు దారితీసింది అని చెప్పవచ్చు. ఎంతో మంది పెద్ద దర్శకులు ఆయనతో సినిమాలు చేయాలని ఎదురు చూస్తూ ఉండగా వారందరినీ కాదని ఒకటే ఒక సినిమా చేసిన ఈ దర్శకుడితో ఆయన సినిమా చేయడం నిజంగా చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి సీన్ ని ఎంతో ఎడ్యుకేషన్ తో చేసి ఈ చిత్రం ఇంత బాగా వచ్చేలా చేశాడు ఈ దర్శకుడు.

త్రివిక్రమ్ మాటలు కూడా చాలా బాగా ఉపయోపడ్డాయి అని తెలుస్తుంది. ప్రతి డైలాగు కూడా ప్రేక్షకులను అలరింప చేసిందట. అలా మొత్తంగా పవన్ ఈ సినిమాకు సంబంధించిన అవుట్ పుట్ విషయంలో ఎంతో సంతోషంగా ఉండటం తప్పకుండా తనకు విజయాన్ని చేకూరుస్తుంది అనే ఆశతో ఉన్నాడట. ఇక తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇటీవల కాలంలో ఆయన సంగీతం అందిస్తున్న సినిమాలకు భారీ స్థాయిలో హిట్ అవ్వడంతో పాటు నేపథ్య సంగీతానికి సైతం మంచి పేరు వస్తుండగా ఈ చిత్రానికి సైతం ఆయన మంచి సంగీతాన్ని సమకూర్చడం చిత్రం హిట్ పవన్ తో పాటు ఈ సినిమాలో చూసే వారు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఇంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: