క్రేజీ గాసిప్: "సలార్"లో కేజిఎఫ్ హీరో యశ్... ?
కాగా కేజీఎఫ్ ఫేం యశ్ ఓ తెలుగు చిత్రంలో డైరెక్ట్ గా రాబోతున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ చేసేందుకు యశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ బాహుబలి తరవాత వరుసగా పాన్ ఇండియా మూవీలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా వీటిల్లో ఓ పాన్ ఇండియా మూవీలో మరో పాన్ ఇండియా హీరో యశ్ కీలక పాత్ర ఎలా ఉండబోతుంది అన్న దానిపై చర్చలు మొదలయ్యాయి. ఇది సలార్ మూవీ అని అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ పాత్ర కోసం యశ్ పారితోషికం ఏమీ తీసుకోకుండానే చేస్తున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి.
అందులోనూ యశ్ కి ఒక రేంజ్ క్రేజ్ ను తెచ్చి పెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అడగడంతో దీనికి ఒప్పుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రభాస్ దే, అలాగే యశ్ ఫ్యాన్ ఫాలోయింగ్ యశ్ దే. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. కానీ ఈ ఇద్దరు పాన్ ఇండియా హీరోలు కనుక ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఆ మ్యాజిక్కే వేరు.