కొత్త సినిమా ఫిక్స్.. అభిమానులు ఊహించని పాత్రలో వరుణ్ తేజ్?
ఇప్పుడు బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గనీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలోవిక్టరీ వెంకటేష్ తో కలిసి నటించినా ఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు వరుణ్ తేజ్ ఎఫ్3 సినిమాతో రాబోతున్నాడు. ఇక ఇదే సమయంలో తన తరువాత చిత్రాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ మెగా హీరో. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్పేస్ నేపథ్యంలో తెరకెక్కిన ఒక సినిమాలో నటించి అదరగొట్టాడు. ఇప్పుడు బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట మెగా ప్రిన్స్.
ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నట్లు టాక్. ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన సినిమాలకు బాలీవుడ్లో ఊహించని రేంజిలో క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేసారట. గతంలో బాలకోట పై భారత ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్ పై ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఇదే సినిమాగా మార్చాలని కొత్త దర్శకుడు ఇక వరుణ్ తేజ్ కు కథ వినిపించగా ఓకే చెప్పేశాడట. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాఊహకు అందని పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తుండటంతో అభిమానులూ మురిసిపోతున్నారు .