షాక్: భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..?
ఇక అందరి బాటలోనే భిమ్లా నాయక్ మూవీ కూడా ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1వ తేదీన రాబోతుందని చిత్రబృందం ప్రకటించడం జరిగింది. కానీ ఈ రెండు తేదీలలో ఏ రోజు వస్తుంది అనేది మాత్రం తెలియజేయడం లేదు. అయితే ఈ సినిమా నిర్మాత నాగ వంశీ కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నట్లుగా సమాచారం.. తాజాగా రెండు రోజుల క్రితం ఈ సినిమాని యూనిట్ మొత్తం చూశారట. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కూడా ఒక స్పెషల్ షో వేసుకొని చూడడం కూడా జరిగిందట. ఇక ఫైనల్ అవుట్ పుట్ పట్ల అందరూ సంతోషంగా ఉన్నట్లు సమాచారం.
ఇక దీంతో నిర్మాత కూడా మరింత కాన్ఫిడెంట్ పెరిగి పోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ గురించి నిర్మాత నాగ వంశీ మాట్లాడడం జరిగింది.. తమ సినిమా మీద పూర్తి నమ్మకం ఉందని.. ఏపీలో రాత్రిపూట ఉండే కర్ఫ్యూ ఎత్తివేసినప్పుడే సినిమాను విడుదల చేస్తామని తెలియజేశాడు.. అది ఈ నెల 25న కావచ్చు.. లేదంటే ఏప్రిల్ -1తారీకు విడుదల చేయవచ్చు అన్నట్లుగా తెలియచేశాడు. ప్రస్తుతానికి భీమ్లా నాయక్ సినిమా మంచి ఊపు మీద ఉందని చెప్పవచ్చు. ఇది మలయాళం నుంచి రీమిక్స్ చేయబడ్డ సినిమా అయినప్పటికీ.. త్రివిక్రమ్ ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకొని చేస్తున్నాడు.