ఎంత త్యాగం.. కళ్యాణ్ రామ్ కోసం 40 కోట్లు వదులుకున్న తారక్?
ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ తో రెండోసారి సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు నిర్మాతగా దర్శకుడు కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడట.అయితే ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ సినిమాకి కూడా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు.
అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం రావట్లేదు. దీంతో కళ్యాణ్ రామ్ కు ఎక్కువగా లాభాలు రాలేదు. దీంతో అన్నయ్య నిర్మాణంలో మరో సినిమా చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్. ఇక ఇప్పుడు అలాంటి ఛాన్స్ రావడంతో ఏకంగా తాను తీసుకునే 40 కోట్ల పారితోషికాన్ని వదులుకున్నాడట. ఇలా చేయడం వల్ల తక్కువ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుందని భావిస్తున్నాడట. అయితే విడుదలైన తర్వాత మాత్రం లాభాల్లో కొంత షేర్ తీసుకోవాలని అనుకుంటున్నాడట జూనియర్ ఎన్టీఆర్. ఇలా ఏకంగా అన్నయ్య కోసం40 కోట్ల పారితోషికం ఎన్టీఆర్ త్యాగం చేశాడంటూ వార్త టాలీవుడ్లో చక్కెర్లు కొడుతుంది.