తెలుగు బుల్లితెరపై రియాలిటీ షో గా పిలువబడుతున్న 'బిగ్ బాస్' అనే కార్యక్రమానికి ఆడియన్స్ లో మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఐదవ సీజన్ ముగిసిన నెల రోజులు కాకుండానే బిగ్ బాస్ ఓటీటీ ని ప్రసారం చేయడానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. సుమారు 15 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా మళ్లీ కింగ్ నాగార్జున నే వ్యవహరించనున్నారు. అంతేకాదు ఈ షోకి ఇదివరకే బిగ్ బాస్ లో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్ లు సైతం హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కూడా కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తయింది.
ఇక ఈ కార్యక్రమం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రసారం అవుతుందని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే బిగ్ బాస్ ఓ టి టి ని ఈసారి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేస్తూ గంట మాత్రమే కాకుండా ఏకంగా 24 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రసారం కాబోయే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ లను త్వరలోనే క్వారంటైన్ కి పంపించానున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీ విడుదల వాయిదా పడిందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ కార్యక్రమం ఫిబ్రవరి 20 వ తేదీన ప్రారంభం కావాలి.
కానీ తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీ నుండి బిగ్ బాస్ ఓటీటీ ని ప్రసారం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే దాదాపు వారం రోజుల పాటు ఈ కార్యక్రమం వాయిదా పడడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే కొన్ని టెక్నికల్ పనులు పూర్తి కాని నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం వాయిదా వేసి తిరిగి ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభించబోతున్న ట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమాన్ని సుమారు 82 రోజులపాటు ప్రసారం చేయనున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విషయం గురించి మాత్రం నిర్వాహకులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు బిగ్ బాస్ ఓ ఓ టి కోసం ఎక్కువగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సెలబ్రిటీలనే ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!