అనుపమ ప్రెగ్నెంట్.. ఈ ఫోటో చూశారా?
ఇక అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత ఇటీవలే కొత్త హీరో ఆశిష్ రెడ్డి తో కలిసి రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో ఏకంగా హాట్ హాట్ సీన్లలో కూడా నటించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. ఇక అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.
ఇక ఈ ఫోటో షేర్ చేసిన తర్వాత చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అనుపమ కు పెళ్లి ఎప్పుడూ అయింది బేబీ బంప్ ఎప్పుడు వచ్చింది అని అవాక్కవుతున్నారు. నిజమే ఇటీవల షేర్ చేసిన ఫోటోలో ఏకంగా అనుపమ ప్రెగ్నెంట్ గా ఉండడం గమనార్హం. ఇక పక్కనే అనుపమ తండ్రి కూడా ఉన్నాడు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడిది అని అనుకుంటున్నారా.. 2019లో మలయాళ చిత్రం షూటింగ్ లో అనుపమ తన తండ్రితో కలిసి ఈ ఫోటో తీసుకోవడం గమనార్హం. ఇటీవల ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది అనుపమ పరమేశ్వరన్.