ఎన్టీఆర్ లైనప్ లో మార్పులు.. అతనే కారణం!!

P.Nishanth Kumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరస సినిమా లతో మంచి లైనప్ పెట్టుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతున్న నేపథ్యం లో ఆయన చేయబోయే తర్వాతి చిత్రం పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్దం చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన తదుపరి చేస్తున్న విషయం తెలిసిందే. రివేంజ్ డ్రామా గా కొరటాల శివ సరికొత్త పంథాలో ఈ చిత్ర కథను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. 

ప్రస్తుతం ఆచార్య సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్న కొరటాల శివ ఈ చిత్రానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి తన తదుపరి సినిమాకు వెళ్లిపోవాలని కొరటాల శివ భావిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ప్రశాంత్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యే విధంగా పరిస్థితి కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇటీవల ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కథకు బాగా ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ సినిమా ఈ గ్యాప్ లో చేయాలని భావిస్తున్నారు. చిన్న దర్శకుడితో సినిమా అంటే తొందరగా అయిపోతుంది ఉద్దేశంతోనే ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడట. అటు తిరిగి ఇటు తిరిగి ప్రశాంత్ నిర్ణయం బుచ్చి బాబు కు కలిసి వచ్చింది. తొందరలోనే ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి ఈ లైనప్ లో మరిన్ని మార్పులు ఉంటాయి లేదా చెప్పిన విధం గా సినిమాలు జరుగుతాయా అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: