సీనియర్ హీరోలు అలా ఫిక్స్ అయ్యారా!!
మెగాస్టార్ చిరంజీవి కూడా 4 సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. వీటిని త్వరగా కంప్లీట్ చేసి మరిన్ని సినిమాలను ఒప్పుకునే విధంగా ఆయన ముందుకు పోతున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో వచ్చే సినిమా అవకాశాల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతున్నాయట. ప్రస్తుతం ఆయన హీరోగా చేసిన ఎఫ్ 3 సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరిన్ని సినిమాల్లో చేసే విధంగా ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు సీనియర్ హీరోలు అందరూ యువ హీరోల తరహా లో సినిమాలు చేస్తుండడం యువ హీరోలను ఎంతో టెన్షన్ కి గుర్తిచేస్తుంది.
వాస్తవానికి సీనియర్ హీరోలు ఇలా ఫిక్స్ కావడానికి కారణం లేకపోలేదు. అభిమానులు వారిని బాగా మిస్ అవుతున్న నేపథ్యంలో ఆరు నెలలకు ఒక సినిమాలో థియేటర్లలో కనిపించి వారిని అలరించాలని చెప్పి వారు ఈ విధమైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారని చెబుతున్నారు. మరి భవిష్యత్తులో వీరు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తారో చూడాలి. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలతో సమానం గా ముందుకు దూసుకుపోతున్న ఈ హీరోలు అభిమానులను సంతోష పరచడం కోసం ఏదైనా చేస్తారు అనడానికి ఇదొక నిదర్శనం.