తమన్ రేంజ్ మళ్లీ పెరగడం ఖాయమట!!

P.Nishanth Kumar
పెద్ద హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు అనే తేడా లేకుండా మంచి సంగీతం అందిస్తూ తమన్ నెంబర్ వన్ సంగీత దర్శకుడు గా ఎదిగాడు టాలీవుడ్ లో.  ఇప్పుడు కూడా ఆయన చేతిలో భారీ హీరోల సినిమాలే ఉండటం విశేషం. అలా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట ఫిబ్రవరి 14వ తేదిన విడుదల కాబోతున్నడంతో ఆ పాట వేరే రేంజ్ లో ఉన్నట్లుగా ఇప్పుడు తెలుస్తుంది. గత మూడు నాలుగు సంవత్సరాల దాకా మన అందరి ప్రేక్షకులను ఎంతగానో అలరించే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సంగీతానికి సంబంధించి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆలరిస్తూ ఉన్నాడు. అందుకే కాబోలు పెద్ద హీరోలు అందరూ పెద్ద దర్శకులతో కూడా తమన్ ను సంగీత దర్శకుడిగా పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆయన సంగీతం సమకూర్చిన అఖండ సినిమాకు ఎంతటి స్థాయిలో పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. నేపథ్య సంగీతానికి ఆయన కు భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అంతేకాదు మరికొన్ని సినిమాలకు కూడా ఆయన నేపథ్య సంగీతం అందించే విధంగా అగ్రిమెంట్లు జరుగుతున్నాయి.

ఆ విధంగా మహేష్ బాబు సినిమాతో తన స్టేటస్ వేరే స్థాయికి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన నేపథ్య సంగీతం మొదలుపెట్టారు. దీంతో ఈ సినిమా తనకు మంచి పేరు తీసుకు రావడం ఖాయం అని తమన్ భావిస్తున్నాడు. ఇవే కాకుండా తమన్ భవిష్యత్తులో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటిదాకా పాటలతో మంచి పేరు సంపాదించుకున్న తమన్ ఇప్పుడు నేపథ్య సంగీతంతో కూడా భారీ స్థాయిలో పేరు దక్కించుకోవడం ఆయన అభిమానులను ఖుషీ చేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: