యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెరపై కనిపించే ఇప్పటికి మూడు సంవత్సరాలు దాటి పోతుంది, ఆఖరుగా జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమాతో ప్రేక్షకులను అలరించాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది, కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆ తర్వాత దేశంలో కరోనా విజృంభించడంతో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది, అయితే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను మార్చి 18 వ తేదీన లేదా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా పనులన్నీ ముగియడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాపై ఫుల్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది, ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న విషయం మన అందరికి తెలిసిందే, ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొరటాల శివ కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 7 వ తేదీన ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా అధికారికంగా లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆలియా భట్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో కూడా చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.