టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ దర్శకుడు రవితేజ హీరోగా తెరకెక్కిన మిరపకాయ్ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు, ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించాడు, గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్ లను కూడా సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హరీష్ శంకర్ క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. ఆ తర్వాత కూడా ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం (డీజే), గద్దలకొండ గణేష్ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో హరీష్ శంకర్ తన మార్కెట్ ను దర్శకుడిగా మరింత పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే జరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే హరీష్ శంకర్ వేదాంతం రాఘవయ్య అనే సినిమాకి కథ అందిస్తున్న హరీష్ శంకర్.. ఇటీవల 'ATM' అనే వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేశారు.
హరీష్ శంకర్ ఈ వెబ్ సిరీస్ కు స్క్రిప్ట్ అందించడమే కాదు.. దిల్ రాజు మరియు జీ స్టూడియోస్ తో కలిసి నిర్మాణంలో భాగం అవుతున్నారు, ఇదిలా ఉంటే తాజాగా ఫిలిం సర్కిల్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం హరీష్ శంకర్ త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. తాను డైరెక్ట్ చేసిన 'దువ్వాడ జగన్నాథమ్' (డీజే) హిందీలో రీమేక్ చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి, ఇలా హరీష్ శంకర్ వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.