పాన్ ఇండియా చేస్తే వందకోట్లు.. విజయ్ దేవరకొండ కూడా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలు చేసే హీరోల సంఖ్య రోజు రోజుకు ఎక్కువైపోతుంది. భారీ స్థాయి ఉన్న సినిమా చేస్తే దాన్ని పాన్ ఇండియా సినిమాలు అనేస్తున్నారు. ముందుగానే సదరు దర్శకులకు పాన్ ఇండియా సినిమా చేయాలని సూచించడంతో దర్శకులు సైతం ఈ విధంగా కథలను తయారు చేయడం ప్రారంభించారు. అలా ఇప్పుడు అగ్ర హీరోలతో పాటు యువ హీరోలు కూడా సినిమాలు భారీ స్థాయిలో దూసుకుపోతున్నారు. ఆ విధంగా విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో కి అడుగుపెట్టబోతున్నాడు.

ఆయన లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి సినిమాకు వంద కోట్ల పారితోషికాన్ని అందుకోవడం అనే విషయం ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని సంవత్సరాలు కష్టపడినా ఫలితం దక్కని హీరోలు ఉన్న ఇండస్ట్రీ లో విజయదేవరకొండ అతి తక్కువ కాలంలోనే ఈ స్టేజ్ కి రావడంతో ఎంతో మంది హీరోలు విజయ్ ఎదుగుదలను చూసి ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు.

ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా చేసి రాధే శ్యామ్ సినిమా చేసిన తర్వాత కానీ వంద కోట్ల క్లబ్ లోకి చేరే లేకపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకొని వంద కోట్ల పారితోషికాన్ని అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. అలా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టక ముందే విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా కోసం వంద కోట్ల పారితోషికాన్ని అందుకోవడం నిజంగా ఆయన టాలెంట్ కు నిదర్శనం అని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న జనగణమన చిత్రం కోసం వంద కోట్ల పారితోషికాన్ని అందుకోవడం ఖాయం అని అంటున్నారు. మరి ఈ సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: