22 యేళ్ళ తర్వాత ఆ హీరోయిన్ తో జతకట్టనున్న అజిత్..!!

Divya
కోలీవుడ్ లో స్టార్ హీరోగా క్రేజ్ ఉన్న హీరో అజిత్.. యువత తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకున్న హీరో అజిత్.. అజిత్ తన కెరియర్ మొదట్లో అమ్మాయిల క్రేజ్ ను బాగా సంపాదించుకున్నాడు. ఇక స్టార్ హీరోయిన్లు సైతం అజిత్ తో నటించడానికి బాగా ఇష్టపడేవారు.. ఇప్పటికీ కూడా ఆయనతో నటించాలని చాలా మంది యువ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎంతో అందంగా ఉండి, స్టైల్ గా డీసెంట్ గా కనిపించే హీరోలు మాస్ ఇమేజ్ ను తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ తమిళ ప్రేక్షకులకు మాస్ హీరో అంటే చాలా ఇష్టం.
అలాంటి మాస్ ప్రేక్షకులను సైతం మెప్పించి అభిమానులను కూడగట్టుకున్నాడు హీరో అజిత్.. మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి సికింద్రాబాద్ కుర్రాడిగా అడుగుపెట్టాడు. ఆ తరువాత నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయాడు. ప్రస్తుతం అజిత్ ఇప్పటికి కూడా అదే ఉత్సాహంతో ఎన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అజిత్ వాలిమై సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ H. వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీకి నిర్మాతగా బోనికపూర్ నిర్వహిస్తున్నారు. ఇక హీరో అజిత్ కూడా ఎవరైనా ఒక డైరెక్టర్ హిట్ ఇచ్చాడు అంటే నిర్మాతలు సైతం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. డైరెక్టర్ వినోత్, నిర్మాత బోనీకపూర్ కాంబినేషన్ లో మరొక సినిమాని చేయాలని చూస్తున్నారట అజిత్. అందుకు సంబంధించిన కథ కూడా విన్నట్లుగా సమాచారం. ఈ సినిమా కూడా ఒక యాక్షన్ డ్రామా కథ తో తెరకెక్కుతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో హీరోయిన్ గా టబు ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2000 వ సంవత్సరంలో చివరిసారిగా ప్రియురాలు పిలిచింది అనే సినిమాలో టబు-అజిత్ నటించారు. ఇప్పుడు మళ్లీ 22 సంవత్సరాల తర్వాత తెరపై ఈ జోడి ని చూడడంతో అజిత్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: