హమ్మో: హేమను చంపేస్తానని బెదిరించి నటుడు ఎవరో తెలుసా..?
అంతేకాదు.. తన ఐఫోన్ మొబైల్ లో కాల్ సును రికార్డ్ చేయడం సాధ్యం కాదని తెలిసి.. కరాటే కళ్యాణి, నరేష్ పై కంప్లైంట్ ఇచ్చినందుకు ఒక వ్యక్తి కాల్ చేసి తనను బెదిరించాడని.. వారి మీద కంప్లైంట్ చేస్తే నన్ను చంపేస్తానంటూ బెదిరించినట్లు హేమ చెప్పుకొచ్చింది. ఇక సరేలే అనడంతో ఆ వ్యక్తి కాల్ కట్ చేశాడని అన్నది. అయితే అలా నన్ను బెదిరించిన తరువాత వాడే భయపడ్డాడని హేమ తెలిపారు.
అయితే తన ఇంట్లో తానే ఒక ధైర్యవంతురాలని హేమ తెలిపారు. ఇక తన ఇంట్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాన్ని సులభంగా హ్యాండిల్ చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా.. ఆ వ్యక్తి బెదిరించిన తర్వాత తన సిమ్ కార్డును ఒక సాంసంగ్ మొబైల్ లో వేశానని.. ఆ వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి కాల్ కట్ చేశాడని తెలిపాడు. ఇక ఈ విషయం మీద మీడియా దగ్గరకు వెళతాం అంటే ప్రకాష్ రాజ్ వదిలేయమని చెప్పారని హేమ వెల్లడించారు. కాగా.. తను ఆ విషయాన్ని వదిలిపెట్టకుండా.. తను తీసుకున్న స్క్రీన్ షాట్ తో పోలీసులకు సమాచారాన్ని పంపించానని పేర్కొన్నారు. ఇక హేమకి తెలిపిన సమాచారం మేరకు.. అతను సినీ ఇండస్ట్రీ లో ఎన్నో కోట్లకు ఆస్తిపరుడని.. తను కూడా ఒక హీరో అని కూడా పేర్కొన్నారు. అయితే ఇలాంటి తప్పులను దేవుడు చూస్తూ ఉంటాడు ఏదో ఒక రోజు దెబ్బ కొడతాడు అని హేమ వెల్లడించారు.