అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది, ఇలా గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు శృతి హాసన్ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో టాలీవుడ్ లో శృతి హాసన్ కు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించిన శృతి హాసన్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోల సరసన చేరిపోయింది, శృతి హాసన్ కేవలం తెలుగు భాషా సినిమాలలో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.
ఇలా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ తాజాగా రెమ్యూనరేషన్ ల గురించి కామెంట్స్ చేసింది. కరోనా సమయంలో రెమ్యునరేషన్ ను తగ్గించుకొమని శృతి హాసన్ ను ఓ నిర్మాత కోరారట, అందుకు శృతి హాసన్ తొలుత అంగీకరించలేదట. తనతో పాటు పని చేస్తున్న హీరో రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటే నేను తగ్గించుకోవడానికి సిద్ధమే అని శ్రుతి హాసన్ చెప్పిందట. ఇక శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం శృతి హాసన్, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. శృతి హాసన్ ఈ సినిమాతో పాటు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతోంది. ఇలా శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.