ముద్దు సీన్లకు వయసుతో పనేముంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఒకప్పుడు సినిమాల్లో లిప్ లాక్ సీన్లు ఉంటే ప్రేక్షకులందరూ కాస్త బూతుగా భావించేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రంప్రేక్షకులు ముద్దు సీన్లు లేని సినిమాలు చూడటానికి అంతగా ఆసక్తి చూపడం లేదు అని చెప్పాలి. దీంతో ఇక ప్రతి సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా లిప్ లాక్ సీన్లు మాత్రం తప్పనిసరిగా ఉంటున్నాయి. అందరు హీరోయిన్లు కూడా లిప్ లాక్ సీన్లకు ఓకే చెబుతూ ఉండటం గమనార్హం. అయితే యువ హీరోయిన్లు మాత్రమే కాదు పెళ్లయిన హీరోయిన్లు కూడా లిప్ లాక్ సీన్లలో నటిస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు. అయితే టాలీవుడ్ లో ఇలా పెళ్లయిన హీరోయిన్లు లిప్ లాక్ సీన్లకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ బాలీవుడ్లో మాత్రం లిప్ లాక్ సీన్లకు మాత్రమే కాదు ఇంటిమేట్ సీన్లలో కూడా రెచ్చిపోతున్నారు.



 బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పదుకొనే రణవీర్ ని  పెళ్లి చేసుకుంది. ఇక ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్స్ తో ఒకటయ్యారు. అయితే పెళ్లికి ముందు ఎన్నో హాట్ సీన్లలో నటించిన దీపికా పదుకొనే పెళ్లి తర్వాత మాత్రం అలాంటి పాత్రలకు దూరంగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ దీపికా పదుకొనే మాత్రం అలాంటి ఆలోచన చేయలేదు. పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోత చేస్తూ హాట్ సీన్లలో నటిస్తూనే ఉంది. ఇకపోతే ఇటీవల దీపికా పదుకొనే సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి గేహ్రహీయా సినిమాలో నటించింది. ఇందులో  రొమాంటిక్ సీన్స్ లో నటించడంతో ఈ అమ్మడు గురించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది.


 అయితే కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను అంటూ గతంలో చెప్పిన దీపిక పదుకునే.. ఇటీవల మాత్రం ఊహించని రీతిలో షాకింగ్ కామెంట్స్ చేసింది. సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి ఇంటిమేట్ సీన్లలో నటించాను అయితే ముద్దు సీన్లతో ప్రేక్షకులను ఎగ్జైట్  చెయ్యాలన్నది నా ఉద్దేశం కాదు. పాత్రకు అవసరం లేని ముద్దు సీన్లలో కూడా నటించను.. అలాగని ముద్దు సీన్లకు వయసుతో ముడిపెడితే మాత్రం అస్సలు అంగీకరించను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది దీపికా పదుకొనే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: