తెలిసిన సింధూరం..తెలియాల్సిన కథ! దటీజ్ రవి తేజ
రావణాసుర అని తనని పిలిస్తే ఇంకాస్త ఇష్టం.
రవి డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చాడు
బాబి గోపీ చంద్ మలినేని ఆ కోవ
ఆ కిక్కు బాగుంది కనుకనే సురేందర్ రెడ్డి హిట్ కొట్టాడు
సక్సెస్ స్పీక్స్ అండ్ ఫెయిల్యూర్ ఆల్సో స్పీక్స్
రెండూ మాట్లాడతాయి ఆ రెంటి దగ్గర పూరీ జగన్ రవి తేజ మరియు ఇంకొందరు
ఉండడమే ఇవాళ్టి విజయ పరంపరకు కారణం. హ్యాపీ బర్త్ డే రవితేజ.
రవితేజ అనే పెద్ద పేరు దగ్గర మాస్ మహారాజ్ అని పిలుచుకుని తీరడం బాగుంటుంది.రవితేజ అనే పెద్ద పేరు దగ్గర సింధూరం ఫేమ్ అని రాయడం మాలాంటివాళ్లకు గౌరవం అనిపిస్తుంది. సామాన్యుల నుంచి ఎదిగివచ్చిన రవితేజకు సినిమాలే ఆస్తి. సినిమాల నుంచి ఎదిగిన రవితేజకు అభిమానులే ఇంకాస్త పెద్ద ఆస్తి. ఆస్తిని తూకం వేయడం విలువ కట్టడం తప్పు కానీ రవితేజను మాత్రం విభిన్న కథలకు కేరాఫ్ గా చూడాలనుకోవడం మాత్రం ఎంత మాత్రం తప్పు కాదు.
డైరెక్టర్ కృష్ణవంశీ కి సింధూరం సినిమా ఓ పెద్ద ప్రాణం. అందులో ఓ చిన్నప్రాణం రవితేజ. కథ పరంగా ఆయన చేయాల్సినంత చేశాడు. అంతకుముందు కూడామెరిశాడు. డబ్బులున్నా లేకపోయినా సినిమా అంటే తన ప్రాణం అని ఓసారి కాదు వంద సార్లు చెప్పి తననితాను నిరూపించుకున్నాడు. ఖడ్గం లాంటి సినిమాలకు, నేనింతే లాంటి సినిమాలకు తనవంతుసాయం చేశాడు.
అన్నయ్య చిరుకు వీరాభిమాని.ఆయనతోనే అన్నయ్య సినిమాతో తెరపంచుకున్నాడు.రవితేజను హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ఇడియట్ ఒకటి.అమ్మానాన్న తమిళ అమ్మాయి రెండోది.అసలు నీ కోసం సినిమాతోనే ఆయన పరుగులు తీశాడు. ఎపుడూ లేని ఆలోచనలతో కదిపికుదిపేశాడు. ఆ పాట మరిచామా..హాయ్ రే హాయ్ జాం పండు రేయ్ పాటను మరిచామా..రవితేజకు గోవిందా గోవిందా అంటూ పాడుకోవడం భలే ఇష్టం.. నుదిట రాతను మార్చుకుని ప్రయాణించి ఇది నా ఆటో గ్రాఫ్ అని చెప్పడం భలే ఇష్టం.