టాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాతగా ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకుంటూ కొనసాగుతున్నారు
దిల్ రాజు. తొలిసారిగా తన
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై
దిల్ మూవీ నిర్మించి ఆ
మూవీ తో సూపర్ హిట్ కొట్టారు
దిల్ రాజు. ఇక అక్కడి నుండి వరుసగా అటు చిన్న హీరోలతో పాటు ఇటు పెద్ద హీరోలతో సైతం సినిమాలు నిర్మిస్తూ
సక్సెస్ లు సొంతం చేసుకుంటున్నారు
దిల్ రాజు.
ఇక ఇటీవల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ వంటి
బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించిన
దిల్ రాజు ప్రస్తుతం
కోలీవుడ్ స్టార్
హీరో విజయ్ తో
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు
రామ్ చరణ్ హీరోగా
శంకర్ దర్శకత్వంలో మరొక భారీ
సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా
విజయ్ మూవీ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండగా
రామ్ చరణ్
మూవీ ఇటీవల ప్రారంభం అయింది. ఇక ఈ రెండు సినిమాలు ఎంతో భారీ ఎత్తున రూపొందుతున్నాయి. ముఖ్యంగా
విజయ్ మూవీ విషయానికి వస్తే, ఈ
సినిమా అటు
తమిళ్ తో పాటు ఇటు తెలుగులోకూడా కలిపి ఏక కాలంలో ద్విభాషా సినిమాగా ఇది రూపొందుతుండగా దీనిపై అటు
కోలీవుడ్ తో పాటు ఇటు
టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
రామ్ చరణ్,
శంకర్ మూవీలో చరణ్ ఒక విభిన్న పాత్ర చేస్తుండగా దీనికి
థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ
మూవీ పాన్
ఇండియా సినిమాగా తెరకెక్కుతుండగా
కియారా అద్వాని
హీరోయిన్ గా నటిస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే, ఇటీవల ఒక
మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా
దిల్ రాజు మాట్లాడుతూ తమ బ్యానర్ నుండి వస్తున్న
విజయ్,
వంశీ పైడిపల్లి మూవీ అలానే
శంకర్,
రామ్ చరణ్ సినిమాల పై ఎంతో పెద్ద నమ్మకం ఉందని, కాగా వీటిలో
విజయ్ మూవీ ఈ ఏడాది
దీపావళి కి, అలానే చరణ్
మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు
దిల్ రాజు వెల్లడించారు. మరి
దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న ఈ రెండు భారీ సినిమాలు ఎంత మేర
సక్సెస్ అందుకుంటాయో చూడాలి.