జయప్రద ను అతను అంత దారుణంగా మోసం చేశాడా..!

Pulgam Srinivas
అందాల నటి జయప్రద గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయం తో ఎంతోమంది ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన జయప్రద టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. జయప్రద  కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. సాంప్రదాయ పాత్రలతో,  గ్లామర్ పాత్రలలో తనదైన శైలిలో  నటించి ప్రేక్షకులను అలరించింది. తన నటనతో, అందచందాలతో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరి మన్ననలు పొందిన జయప్రద రాజకీయాల లోకి వెళ్లడం వల్ల చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు జయప్రద తన రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. సినిమా కెరియర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదిగిన జయప్రద ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ గా, నిజాయితీగా ఉంటుంది అని చాలా మంది అంటూ ఉంటారు.


 కానీ అలాంటి జయప్రద జీవితంలో ఒక తప్పు చేసింది. ఆ తప్పు వల్ల జయప్రద జీవితం నాశనం అయ్యింది అని జయప్రదం అభిమానులు అంటూ ఉంటారు. అసలు విషయంలోకి వెళితే జయప్రద సినీ ఇండస్ట్రీలో శ్రీకాంత్ నహతా అని ఒక ప్రొడ్యూసర్ తో ప్రేమలో పడ్డి.. ఎవ్వరికి తెలియకుండా శ్రీకాంత్-జయప్రద ప్రేమించి వివాహం చేసుకున్నట్లు సమాచారం. కానీ అతనికి అప్పటికే పెళ్ళై ఇద్దరు పిలలు ఉన్నారు. ఈ సంగతి జయప్రదకు తెలియదు. ఇక పెళ్లయ్యాక ఆయనకు ముందే పెళ్ళి అయ్యిందని తెలిసి షాక్ అయ్యిందట. దాంతో ఆ బాధలు భరించలేక జయప్రద అప్పట్లో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించినట్లు సమాచారం. అప్పటి నుండి జయప్రద ఆయనను దూరం పెడుతూ వచ్చిందట. ఇది ఇలా ఉంటే ఇక ఈ ప్రొడ్యూసర్ ఎవరో కాదు అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకి ప్రొడ్యూసర్ గా ఉన్న సుందర్లాల్ కుమారుడే ఈ శ్రీకాంత్. ఇలా ఒక చిన్న మిస్టేక్ వల్ల జయప్రద జీవితంలో చాలా కోల్పోయినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: