టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లవ్లీ కపుల్స్ గా పేరుగాంచిన అక్కినేని
నాగచైతన్య -
సమంత ఇటీవల విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రేమించి
పెళ్లి చేసుకుని నాలుగేళ్ల తర్వాత ఈ జంట గత ఏడాది తమ విడాకుల విషయమై సోషల్
మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. వీరి విడాకుల ప్రకటనతో ఒక్కసారిగా అభిమానులతోపాటు
సినిమా ఇండస్ట్రీ కూడా షాక్ కి గురైంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడం వెనక కారణాలేంటని చాలా రోజుల వరకు అభిమానులు, సినీ ప్రముఖులు వీరి విడాకుల గురించి ఆరా తీశారు. కానీ ఇప్పటివరకు ఆటు చైతు గానీ ఇటు
సమంత గాని విడాకులకు అసలు కారణాలు ఏంటో చెప్పనేలేదు.
అటు అక్కినేని కుటుంబ సభ్యులు సైతం వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలను ఎక్కడా చెప్పలేదు. అయితే తాజాగా
నాగార్జున వీరి విడాకుల విషయం పై ఓపెన్ అయ్యారు.' వీరి విడాకుల గురించి ఎన్ని పుకార్లు వచ్చినా ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. కనీసం ఒక్క మాట కూడా అనలేదు. కానీ ప్రతీ విషయంలో చాలా భయపడ్డాను' అని చెప్పుకొచ్చారు నాగార్జున. 'కానీ చైతు నా గురించి ఎక్కువగా వర్రీ అయ్యేవాడు. చైతు నా దగ్గరికి వచ్చి మీరు బానే ఉన్నారా అని అడిగేవాడు. అసలు నేను కదా ఆ మాట అడగాల్సింది అని అనుకునేవాడిని' అని అన్నారు నాగార్జున.