లైకా ప్రొడక్షన్ లో అల్లు అర్జున్..!

shami
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ గా ప్రమోట్ అయినట్టే అని చెప్పొచ్చు. పుష్ప సినిమా తెలుగుతో పాటు ఈక్వల్ గా తమిళ, హిందీ భాషల్లో వసూళ్లని రాబట్టింది. సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో పాటుగా అల్లు అర్జున్ అద్భుత నటన పుష్ప సినిమాని నెక్స్ట్ లెవల్ లో నిలబెట్టాయి. పుష్ప సినిమా తమిళ వర్షన్ ని లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేశారి. 3, 4 కోట్ల డీల్ జరుగుతున్న టైం లో లైకా ప్రొడక్షన్స్ ఏకంగా 7 కోట్లు ఇచ్చి అక్కడ రిలీజ్ చేశారట. అంతేకాదు పుష్ప మూవీని తమిళంలో కూడా బాగానే ప్రమోట్ చేశారు.
అందుకే కోలీవుడ్ లో పుష్ప రాజ్ హవా నడిపించాడు. కేవలం తమిళ వర్షన్ తోనే దాదాపు 30 నుండి 40 కోట్ల దాకా వసూళ్లు రాబట్టాడని తెలుస్తుంది. అందుకే ఇంతటి గొప్ప వ్జయం అందించిన అల్లు అర్జున్ తో ఒక సినిమా ఆఫర్ చేశారట లైకా ప్రొడక్షన్స్. అల్లు అర్జున్ కూడా ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ తో అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప తర్వాత బన్నీ చేసే ప్రతి సినిమా నేషనల్ లెవల్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
లైకా ప్రొడక్షన్ అల్లు అర్జున్ కోసం ఓ మంచి కథ వెతుకుతున్నారట. కథ సెట్ అయితే డైరక్టర్ ని ఫిక్స్ చేసి త్వరలోనే సినిమా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. పుష్ప తర్వాత అసలైతే కొరటాల శివతో బన్నీ మూవీ ఒకటి ప్లాన్ చేశాడు. అయితే అది వెనకపడ్డదని తెలుస్తుంది. ఇక ఇప్పుడు లైకా ప్రొడక్షన్ లో బన్నీ పాన్ ఇండియా మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: