సామ్ చేసిన పనికి చైతూ స్ట్రాంగ్ రిప్లై..

Purushottham Vinay
ఇక ఇంతకుముందు నాగ చైతన్యతో బ్రేకప్ అయ్యి అతని నుంచి విడిపోయిన వెంటనే సమంత రూత్ ప్రభు పుష్ప చిత్రంలో అదిరిపోయే బోల్డ్ ఐటమ్ నంబర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఊ అంటావా ఊహూ అంటావా! అంటూ సాగే ఈ పాటలో హాట్ మూవ్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది సమంత. ఇక ఈ పాటను పెద్ద సక్సెస్ చేయడంలో తన ప్రతిభను చూపింది సమంత. సేమ్ టైమ్ ఇది నాగ చైతన్యకి కౌంటర్ అంటూ సోషల్ మీడియాలో ఈ గుసగుస బాగా వేడెక్కించింది.అయితే నాగ చైతన్య నుంచి ఆమెకు రిప్లై లేదా? అంటే ఇదిగో తనదైన స్టైల్ లో చైతూ ఇచ్చిన సక్కర్ పంచ్ సమంతకు మామూలుగా లేదు. ఇప్పటికే సామ్ పై చై అభిమానులు బాగా నిందలు మోపారు. నెటిజనులు ఆమెను చాలా ఘోరంగా ట్రోల్స్ చేశారు. బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య ఎక్కువమంది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి గుచ్చి గుచ్చి సమంతను బాగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఇక ఇటీవల వైరల్ అయిన ఫోటోలలో ఒకదానిలో పుష్ప సినిమాలోని సమంతా పాట నుండి ఒక పోజ్ ని సేకరించి.. ఇక దానికి చైతన్య అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న వేరొక ఫోటోని యాడప్ చేసి.. ఓ అభిమాని సామ్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇదే అంటూ పంచ్ వేసాడు. సమంత బోల్డ్ యాక్షన్ చేస్తే.. చైతన్య ఇంతమంది అమ్మాయిలతో ఘాటైన రొమాన్స్ చేస్తూ జవాబిచ్చారని అన్నారు. అలాగే ఈ సినిమాలో నాగ చైతన్యను పెళ్లిపై ఆసక్తి లేని ప్లేబాయ్ గా మేకర్స్ చూపించారు. సింగిల్ లైఫ్ చాలా బెటర్ అని చైతూ చెప్పే డైలాగ్స్ సినిమాలో ఉన్నాయి. సమంత నాగ చైతన్య జీవితంలో ముందుకు సాగుతుండగా.. ఇవన్నీ కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు సమంతను చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

మొత్తానికి ఇది పంచ్ కు పంచ్ అన్నట్టుగా ఇక్కడ తయారైంది.ఇక వీరి సినిమాల విషయానికి వస్తే ఇద్దరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్ యూ అనే సినిమా అలాగే ఓ వెబ్ సిరీస్ ఇంకా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సమంత బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో ఓ ప్రాజెక్ట్, ఇక గుణశేఖర్ తో శాకుంతలం ఇంకా త్రివిక్రమ్ తో సినిమా చేస్తూ వుంది. కెరీర్ పరంగా వీరిద్దరూ కూడా తమ సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: