ఈ హీరోలు గేర్ మార్చాల్సిందే!!
అలా వారు సినిమాలు చేస్తున్న సమయంలో ఒకానొక సమయం మాత్రం వారికి ఫలానా సినిమాలు చేయడం మొదలుపెట్టాలి అని గుర్తు చేస్తూ ఉంటుంది. అది గుర్తించి దానికి తగ్గట్టుగా సినిమాలు చేస్తే వారి కెరీర్ మరొక లెవెల్ కి వెళుతుంది. అలా టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ముగ్గురు హీరోల జోనర్ మార్చి సినిమాలు చేసే సమయం వచ్చింది. వారే అక్కినేని నాగ చైతన్య, నితిన్ అలాగే శర్వానంద్. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు మీడియం రేంజ్ ఇమేజ్ ఉన్న హీరో లే.
15 కోట్ల నుంచి 25 కోట్ల మధ్య వీరిపై నిర్మాతలు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు చిన్న తరహా కథలను మాత్రమే ఎంచుకుని సినిమాలు చేసిన వీరు ఇప్పుడు పెద్ద తరహా కథలను ఎంచుకొని సినిమాలు చేయవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే పెద్ద హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పనిలో ఉన్నారు. అలాంటప్పుడు ఈ హీరోలు తెలుగు రాష్ట్రాలలోనీ ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించాలి. వీరు ముగ్గురు కమర్షియల్ హంగులు ఉన్న సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీన్ని గమనించి ఈ ముగ్గురు హీరోలు తమ సినిమాలు చేసే విధానంలో తేడాను చూపిస్తారా చూడాలి.