మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయ మన అందరికీ తెలిసిందే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో బోలా శంకర్ సినిమా ఒకటి, ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది, చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాత, ఈయన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ బాబుతో `సరిలేరు నీకెవ్వరు` వంటి బారీ చిత్రాన్ని తెరకెక్కించి సోలోగా భారీ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ సుంకర ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా `భోళా శంకర్` మూవీ ని నిర్మిస్తున్నారు, ప్రస్తుతం బోలా శంకర్ సినిమా షూటింగ్ దశలో ఉంది. గత కొన్ని నెలలుగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో ఈ సినిమా తప్ప మరో సినిమా గురించి ఆలోచించడం లేదంట.
అన్నీ బోలా శంకర్ తర్వాతే అని ఎవరు అడిగినా ఏకే ఎంటర్టైన్మెంట్స్ టీమ్ చెబుతున్నారట, ఫుల్ ఫోకస్ ని ఈ సినిమాపై పెట్టి ఎలాగైనా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట అనిల్ సుంకర. సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్న నిర్మాత అనిల్ సుంకర, బోలా శంకర్ సినిమాతో ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటాడో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బోలా శంకర్ సినిమాతో పాటు ఆచార్య, గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, వీటితో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి మెగాస్టార్ రెడీగా ఉన్నాడు.