రౌడీ బోయ్స్ వెనక ఆ ఇద్దరు స్టార్ డైరక్టర్స్..!

shami
దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సంక్రాంతి సినిమా రౌడీ బోయ్స్. ఈ సినిమాలో హీరో కూడా దిల్ రాజు ఫ్యామిలీ వారసుడే అవడం తో సినిమాపై ఇంకాస్త ఫోకస్ పీట్టారు. ఫ్యామిలీ నుండి వస్తున్న మొదటి హీరో కాబట్టి అతన్ని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని ఓ మాంచి యూత్ ఫుల్ కంటెంట్ తో రౌడీ బోయ్స్ అంటూ వస్తున్నారు. హర్ష డైరక్షన్ లో ఆశిష్, అనుపమ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. యూత్ ఫుల్ కంటెంట్ మాత్రమే కాదు యూత్ ఆడియెన్స్ మెచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తుంది.
అయితే ఈ సినిమాతో ఎలాగైనా ఆశిష్ కు హిట్ ఇవ్వాలనే ఉదేశంతో రౌడీ బోయ్స్ సినిమా విషయంలో ఇద్దరు స్టార్ డైరక్టర్స్ యొక్క సలహాలు తీసుకున్నారట. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న అనీల్ రావిపుడి.. దిల్ రాజి బ్యానర్ లో ఆస్థాన డైరక్టర్ వేణు శ్రీరాం కూడా రౌడీ బోయ్స్ సినిమాకు హెల్ప్ చేశారని తెలుస్తుంది. సినిమా పూర్తయ్యాక ఫస్ట్ కాపీ చూసి మరి సినిమాకు కావాల్సిన ఛేంజెస్ చెప్పారట. రౌడీ బోయ్స్ సినిమాలో అనీల్ రావిపుడి, వేణు శ్రీరాం ఇద్దరు తమ కాంట్రిబ్యూషన్ ఇచ్చారని టాక్.
సో సినిమా హిట్ అయితే మాత్రం వాళ్లిద్దరికి క్రెడిట్స్ ఇచ్చేయాల్సిందే. ఆశిష్, అనుపమ జోడీ కూడా సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా మెప్పించేలా ఉన్నాయి. మరి ఆషిష్ తొలి ప్రయత్నం ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. దిల్ రాజు మాత్రం స్టార్ హీరోలందరితో ప్రమోట్ చేయించడమే కాకుండా హీరోయిన్స్ తో కూడా వీడియో బైట్ తీసుకుని రౌడీ బోయ్స్ ప్రేక్షకులను దగ్గరయ్యేలా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: