వావ్ : అవతార్ 2 వచ్చేస్తుందిరోయ్..!
అయితే మొదటి పార్ట్ కు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించి కూడా ఎన్నో ఏళ్ళు గడుస్తున్నాయి. ‘అవతార్’ సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు సైతం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడసాగారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారట మేకర్స్. ఈ సినిమాను 2022 డిసెంబర్ 16న విడుదల చేయబోతున్నారని సమాచారం.. అయితే ఈ సినిమాకు సంబంధించిన నాలుగు పార్ట్స్ కూడా వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయట.
2009లో కామెరాన్ ‘అవతార్’ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను అన్నింటిని బద్దలు కొట్టింది. ఆ తరువాత ‘అవతార్’కి నాలుగు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో పడ్డాడట కామెరూన్ అందులో భాగంగా ‘అవతార్ 2’ను ఈ ఏడాది అంటే 2022, డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు. నిజానికి 2014లో విడుదల చేస్తున్నాం అని చెప్పారు.. ఆ తర్వాత పలు మార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది ఈ సీక్వెల్. ఆ తర్వాత రెండో సీక్వెల్ ను 2024 డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా. మూడవ సీక్వెల్ 2026 డిసెంబర్‌లో అలాగే చివరిదైన నాలుగో సీక్వెల్ చిత్రం 2028 డిసెంబర్‌లో విడుదల అవుతాయని సమాచారం.
ఈ సీక్వెల్స్ లో రెగ్యులర్ తారాగణంతో పాటు కేట్ విన్స్లెట్ మరియు విన్ డీజిల్ తో పాటు మరి కొంత మంది నటీనటులు కొత్తగా యాడ్ అయ్యారని సమాచారం.. పండోర గ్రహంలోని నీటి అడుగున ఉన్న దిబ్బల మధ్య కొత్త తెగకు చెందిన ప్రజలను ఈ సీక్వెల్స్ లో పరిచయం చేబోతున్నారట.కామెరాన్. ‘అవతార్ 2’లో పండోరలో తెలియని విషయాలను చూపిస్తూ నీటి అడుగున జీవిస్తున్న మెటికెయినా తెగ ప్రజల జీవితాలను ఆవిష్కరించనుందట.మరోసారి అద్భుతమైన లోకాన్ని మన కళ్ళముందు ఆవిష్కరించబోతున్నారు ‘అవతార్-2’ మేకర్స్.