ఆ దర్శకులను ఎప్పటికి నమ్మను: మహేష్

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఇక వరుస హిట్లతో జోరుమీద ఉన్న మహేష్‌ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ తన కెరీర్లో ఎంతో మంది స్టార్ దర్శకులతో కలిసి పని చేశారు.
అయితే మహేష్ గుణశేఖర్ - సుకుమార్ - అనిల్ రావిపూడి - కొరటాల శివ - త్రివిక్రమ్ శ్రీనివాస్ - వంశీ పైడిపల్లి - రాఘవేంద్ర రావు - బి.గోపాల్ - జయంత్ - కృష్ణవంశీ - పూరి జగన్నాథ్ - శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్లతో కలిసి పని చేశాడు. కాగా.. వీరిలో చాలా మంది దర్శకులకు మహేష్ భవిష్యత్తులోనూ మరోసారి అవకాశం ఇవ్వవచ్చునని సమాచారం. ఇక వీరిలో ఇద్దరు దర్శకులకు మాత్రం మహేష్ ఎప్పటికీ మరో ఛాన్స్ ఇవ్వడన్న టాక్. ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో ఉన్న సంగతి అందరికి తెల్సిందే.
ఇక ఆ ఇద్దరు దర్శకులు ఎవరో కాదు ఒకరు శ్రీకాంత్ అడ్డాల.. మరొకరు వి.వి.వినాయక్ అన్నమాట. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్ ఇచ్చాడన్న నమ్మకంతో మహేష్ బాబు శ్రీకాంత్‌కు బ్రహ్మోత్సవం సినిమాలో మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అలాగే శ్రీమంతుడు సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో ఉండగా శ్రీకాంత్ అడ్డాల మహేష్ కలిసి ఫ్యామిలీ స్టొరీ అని చెప్పడంతో మహేష్ కథ పూర్తిగా వినకుండా శ్రీకాంత్‌పై నమ్మకంతో వెంటనే ఓకే చెప్పేసాడు. చివరికి కథ రెడీ కాకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: