2020 పొంగల్ పోరు : మహేష్ vs బన్నీ ఎప్పటికీ మర్చిపోలేమబ్బా ..... ??

GVK Writings
సరిగ్గా రెండేళ్ల క్రితం సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో తలపడ్డ విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి హీరోగా మహేష్ నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు 2020 సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయశాంతి ముఖ్య పాత్ర చేయగా ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించారు. మహేష్ బాబు ఈ సినిమాలో మేజర్ అజయ్ కృష్ణ పాత్ర చేయగా చాలా రోజుల తరువాత బండ్ల గణేష్ ఈ సినిమాలో ఒక చిన్న కామెడీ రోల్ చేసి ఆకట్టుకున్నారు.
బాక్సాఫీస్ పరంగా అనేక ప్రాంతాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ అలవైకుంఠపురములో. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ వారు ఈ మూవీని నిర్మించారు. రిలీజ్ తరువాత భారీ సక్సెస్ సొంతం చేసుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ అయితే యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని సెన్సేషన్ సృష్టించాయి. ఇక అల్లు అర్జున్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిన అలవైకుంఠపురములో మూవీ ఆయనకి మరింతగా క్రేజ్ ని తెచ్చిపెట్టింది.
అయితే విషయం ఏమిటంటే, కేవలం రెండు రోజుల గ్యాప్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయి రెండూ కూడా సూపర్ సక్సెస్ కొట్టడం విశేషం అని చెప్పాలి. ముఖ్యంగా ప్రతి ఏడాది మాదిరిగా ఆ ఏడాది ఈ ఇద్దరి సినిమాలు కూడా సక్సెస్ కావడం అదీకాక రెండూ కూడా అనేక ప్రాంతాల్లో మంచి కలెక్షన్ సొంతం చేసుకోవడం మరింత విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ విషయమై అప్పట్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయా హీరోల ఫ్యాన్స్ మధ్య, అలానే నిర్మాణ సంస్థల మధ్య ఒకింత కోల్డ్ వార్ జరిగింది. మొత్తంగా 2020 పొంగల్ బాక్సాఫీస్ వార్ లో అటు మహేష్,ఇటు అల్లు అర్జున్ ఇద్దరూ కూడా సూపర్ సక్సెస్ లు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: