జీవిత ఫైర్‌బ్రాండా.. గాడిద గుడ్డా.. అయ్యో.. పరువు తీసేశారుగా..?

Chakravarthi Kalyan
సినీరంగంలో కొందరిపై కొన్ని ముద్రలు ఉంటాయి.. ఆ పేరు ఎలా వచ్చినా.. ఒకసారి పేరు వస్తే మాత్రం పోదు.. నటి జీవిత పరిస్థితి కూడా అంతే.. నటి జీవితను అంతా సినిమా ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ అంటారు. అనేక విషయాల్లో ఆమె ప్రవర్తించిన తీరును బట్టే ఆ పేరు వచ్చింది. అయితే జీవితపై ఉన్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అంతా బయటే మాత్రం అంటారు ఆమె కుటుంబ సభ్యులు.. అంతా జీవితను ఫైర్ బ్రాండ్ అని అంటుంటే.. తనకు బాగా నవ్వొస్తుందంటారు ఆమె భర్త రాజశేఖర్.

జీవితకు ఫైర్ బ్రాండ్ అన్న పేరు బయటే ఉంటుందని.. కానీ ఆమె ఇంట్లో తుస్స్ బ్రాండ్‌ అని కాస్త హాస్యంగా చెప్పారు రాజశేఖర్. అసలు జీవిత ను చూసి ఎందుకు భయపడతారో అని ఆయన ఆశ్చర్య పోయారు. వాస్తవానికి జీవిత ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటారని.. అస్సలు కోప్పడరని
అంటున్నారు రాజశేఖర్.. నటి జీవిత కూడా అదే విషయం చెబుతున్నారు. తనను ఫైర్ బ్రాండ్ అంటే తన కుటుంబ సభ‌్యులంతా నవ్వుతారని అంటున్నారు. అసలు తమ ఇంట్లో పెద్దగా ఎలాంటి గొడవలు రావని.. ఒకవేళ ఏదైనా గొడవ వచ్చినా ముందుగా తానే సారీ చెప్పేస్తానని జీవిత చెబుతున్నారు.

జీవిత, రాజశేఖర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లన్న సంగతి తెలిసిందే. వారు కూడా.. మమ్మీ.. నువ్వేంటి ఫైర్ బ్రాండ్ ఏంటి మమ్మీ.. నిన్ను చూసి వీళ్లంతా ఎందుకు భయపడుతున్నారు మమ్మీ అని ఆశ్చర్యపోతుంటారని జీవిత చెబుతున్నారు. సినీరంగంలో జీవిత, రాజశేఖర్‌ జంటది ఓ అపూర్వమైన జంట. కొన్ని సినిమాల్లో మొదట్లో కలిసి నటించిన వీరు.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.  వీరి పెళ్లికి మొదట్లో ఇరువైపులా ఒప్పుకోలేదు.. కానీ.. పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు.

తామిద్దరు ప్రేమలో ఉన్న సమయంలోనే మగాడు సినిమా షూటింగ్‌లో రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అప్పటికి వారి పెళ్లి జరగకపోయినా.. జీవితే దగ్గరుండి సేవలు చేశారట. అప్పుడే జీవిత కూడా రాజశేఖర్‌ తల్లిదండ్రులకు బాగా నచ్చారని.. ఆ తర్వాత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఈ జంట ఓ ఇంటర్వ్యూలో ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: