నాగార్జున రెండు నాల్కల ధోరణి.. ఎవరికి నష్టం!!
బంగార్రాజు సినిమా విడుదల తేదిని అధికారికంగా వెల్లడించడానికి చిత్ర యూనిట్ ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేయ గా నాగార్జున మాట్లాడిన మాటలు ఒక్కసారిగా తెలుగు వారినీ ఎంతో ఆశ్చర్యపరిచాయి. సినిమా హీరోలు తెర మీద మాత్రమే హీరోలు నిజ జీవితం లో హీరోలు కాదు అవకాశవాదులు అన్నట్లుగా ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు ఎంతో వివాదాస్పదమైనది అనీ సినిమా విశ్లేషకులు విమర్శిస్తున్నారు. సినిమాలలో ప్రజలకు ఏమాత్రం ఆపద వచ్చినా తమ వర్గానికి తాము పనిచేస్తున్న రంగానికి ఏ ఆపద వచ్చినా హీరోలు తిరగబడి తమ అవకాశాలను తిరిగి సంపాదించుకుంటారు.
అలాంటిది నిజ జీవితంలో మన హీరోలు ఎందుకు ఇలా భయపడుతున్నారు అ ని నాగార్జున మాటలను బట్టి తెలుస్తుంది అని ఎంతో మంది కామెంట్లు చేశారు. సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడటం సరికాదు అంటూనే ఆయన జగన్ కు వత్తాసు పలికినట్లుగా ఆయన స్పీచ్ ఉండడం అక్కినేని అభిమానులు కూ డా ఎంతో ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో నాగార్జున ఆచరిస్తున్న ఈ రెండు నాల్క ల ధోరణి పై విమర్శలు వెలువడుతున్నాయి. మరి ఈ వివాదం ఆయన విడుదల చేస్తున్న సినిమా పట్ల ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.