రామ్ చరణ్, రానా, శర్వానంద్.. ఈ ముగ్గురికీ ఉన్న కామ‌న్ పాయింట్‌ ఏంటో తెలుసా?

VUYYURU SUBHASH
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, రానా ద‌గ్గుబాటి, శ‌ర్వానంద్‌.. ఈ ముగ్గురు హీరోలు తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో త‌మ‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ ప్ర‌స్తుతం పాన్ ఇండియా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగాడు. మ‌రోవైపు నిర్మాత‌గానూ స‌త్తా చాటుతున్నాడీయ‌న‌.

రానా ద‌గ్గుబాటి.. టాలీవుడ్ బ‌డా నిర్మాత డి.సురేష్ బాబు కుమారుడీయ‌న‌. ఆయ‌న అండ దండ‌ల‌తోనే `లీడర్` సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన రానా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబలి` సినిమాలో విల‌న్‌గా విశ్వ రూపం చూపించి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ చిత్రాల్లోనూ న‌టించి భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న రానా ద‌గ్గుబాటి బుల్లితెర‌పై హోస్ట్‌గా కూడా చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు.

ఇక శ‌ర్వానంద్ విషయానికి వ‌స్తే.. ఈయ‌న‌కు ఎటు వంటి బ్యాక్‌గ్రౌండ్ లేక పోయినా ఇండ‌స్ట్రీలో స్వ‌యం కృషితో బాగానే నిల‌దొక్కుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న చిన్న పాత్ర‌ల‌ను పోషించిన శ‌ర్వా నంద్.. గ‌మ్యం సినిమాలో పూర్తి స్థాయి హీరోగా న‌టించి సూప‌ర్ క్రేజ్‌ను ద‌క్కించుకున్నాడు. ఆ త‌ర్వాత విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ తెలుగు ప్రేక్ష‌ల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. యూత్‌లోనూ శ‌ర్వాకు మంచి ఫాలోయింగ్ ఉంది.

అయితే రామ్ చరణ్, రానా, శర్వానంద్ ల‌కు ఉన్న కామ‌న్ పాయింట్‌ ఏంటీ అంటే.. ఈ ముగ్గురూ బాల్యంలో ఒకే స్కూల్‌లో క‌లిసి చ‌దువుకున్నారు.  బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రామ్ చ‌ర‌ణ్‌, రానా, శ‌ర్వాలు విద్యా భ్యాసం చేశారు. చాలా ఏళ్లు కలిసి చదువుకున్నా వీరి మధ్య ఎప్పుడూ సినిమాల ప్రస్తావన వచ్చేది కాద‌ట‌. అప్పుడు ఎవరికీ సినిమాల గురించి అంత అవగాహనా లేదు. కానీ, సీన్‌ క‌ట్ చేస్తూ ముగ్గురూ హీరోలుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో త‌మ‌దైన ముద్ర వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: