
సంక్రాంతి సినిమాలకు సరికొత్త సమస్యలు !
ఈసినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ కూడ మొదలుపెట్టేసారు. అయితే ఈసినిమాలు అన్నీ సంక్రాంతికి విడుదల అవుతాయా అవ్వవా అన్న టెన్షన్ ఈసినిమా యూనిట్ వర్గాలలో కొనసాగుతున్నట్లు టాక్. దీనికికారణం ఈసినిమాలలో దేనికీ పూర్తి స్థాయిలో థియేటర్లు ఖరార్ అవ్వలేదు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈసినిమాలకు సంబంధించి అమెరికాలో ప్రిమియర్స్ సంగతి కూడ తేలలేదు అని తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా ‘బంగార్రాజు’ మూవీకి ఈపాటికే అమెరికాలో స్క్ర్రీన్ లు ఖరారై బుకింగ్స్ కూడ ఓపెన్ కావాలి. కానీ కరోనా కారణంగా తలెత్తిన అనిశ్చితి వల్ల చివరివరకు టెన్షన్ తప్పేలా లేదు అన్నవార్తలు వస్తున్నాయి. దేశంలో కరోనా కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది రోజు వారీ కేసులు రెట్టింపు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. సంక్రాంతి సమయానికి దేశంలో రోజుకి కరోనా కేసులు సంఖ్య 2 - 3 లక్షల మధ్య ఉంటుందని అంచనాలు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రలలో పండుగ సమయంలో ప్రయాణాలు వేడుకలకుతోడు సినిమా థియేటర్లలో ప్రేక్షకులను కూడ పూర్తి స్థాయిలో అనుమతిస్తే సంక్రాంతి సీజన్ అయ్యేసరికి కరోనా ఉద్ధృతి పతాక స్థాయికి చేరుకోవచ్చనే ఆందోళన అన్ని వర్గాలల లోను ఉంది. దీనికితోడు సంక్రాంతి తరువాత ఆక్యుపెన్సీ 50 శాతానికి పడిపోవడమే కాకుండా ఏపీలో నైట్ కర్ఫ్యూ పెట్టే పరిస్థితులు వస్తాయని ఆతరువాత ఈ నెలాఖరకు కేసులు మరింత పెరిగిపోతే మళ్ళీ ధియేటర్లు మూతపడే పరిస్థితులు ఏర్పడతాయని అంటున్నారు. దీనితో సంక్రాంతి సినిమాలు విడుదల అయినా ఆతరువాత రెండు వారాలలో వచ్చే పరిస్థితుల మధ్య నిలదొక్కుకుని నిలబడగలుగుతాయా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి..