శ్యామ్ సింగ రాయ్ సూపర్ అనేసిన చరణ్..!

shami
నాచురల్ స్టార్ నాని కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. 2021 చివర్లో క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు కానీ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా సూపర్ అనేలా చేశాడు నాని. శ్యామ్ సింగ రాయ్ మూవీ లో నాని రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించాడు. అందులో ఒక పాత్ర వాసు కాగా.. రెండో పాత్ర శ్యామ్ సింగ రాయ్ ది.

శ్యామ్ సింగ రాయ్  సినిమా సినిమా చూసిన సెలబ్రిటీస్ ఇప్పటికే తమ స్పందన తెలియచేశారు. ఇక లేటెస్ట్ గా సినిమా చూసిన నాని తన ట్విట్టర్ లో సినిమాపై ప్రశంసలు కురిపించారు. కుదూస్ టూ టీం.. శ్యామ్ సింగ రాయ్  సినిమా అదిరిపోయింది. నాని నటన, రాహుల్ డైరక్షన్ అన్ని అద్భుతంగా ఉన్నాయని చరణ్ ట్వీట్ చేశారు. నాని సినిమా కు చరణ్ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.

మంచి ప్రయత్నం చేసినప్పుడు టాలీవుడ్ ప్రముఖుల నుండి కాస్త లేట్ అయినా కూడా స్పందన వస్తుంది. ప్రస్తుతం నాని శ్యామ్ సింగ రాయ్  సినిమా కు కూడా సినిమా లేట్ గా చూసిన సెలబ్రిటీస్ ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ స్పందన తెలియచేస్తున్నారు. తానొక స్టార్ హీరో అయ్యుండి నాని సినిమా చూసి సూపర్ అనాల్సిన అవసరం లేకపోయినా సరే చరణ్ శ్యామ్ సింగ రాయ్  సినిమా చూసి ప్రశంసలు అందించారు. చరణ్ కామెంట్స్ తో శ్యామ్ సింగ రాయ్  టీం సూపర్ జోష్ లో ఉంది. ట్యాక్సీవాలాతో ప్రతిభ కనబరచిన రాహుల్ శ్యామ్ సింగ రాయ్  తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: