రెండు డబుల్ రోల్స్ చిత్రాలు.. ఒకేసారి.. ఓటిటీలో కూడా పోటీ?
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అందరినీ మెప్పించింది. గత జన్మ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేశారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా జనవరి 21వ తేదీన నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందనీ తెలుస్తుంది. అయితే ఇదే రోజు మరో స్టార్ హీరో సినిమా కూడా ఓటిటీలో కి రావడానికి సిద్ధమయ్యింది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం గమనార్హం. కాగా జనవరి 21వ తేదీన అఖండ డిస్ని లో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓటిటి లో కూడా ఈ రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయి.
కాగా నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ్ సినిమా డిసెంబర్ 24వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఉండటం గమనార్హం. అయితే నాని శ్యాం సింగరాయి డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సివుంది. దీంతో ఇక ఓటీటీ వద్ద సత్తా చాట బోతున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. రెండు ద్విపాత్రాభినయం సినిమాలు ఒకే రోజు ఓటిటి లో విడుదలై పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది.