అమ్మ బాబోయ్..కెరీర్లోనే బిగ్గెస్ట్ రిస్క్..ఆలోచించుకో చిట్టీ..?

VUYYURU SUBHASH
జాతి ర‌త్నాలు సినిమాలో హీరోయిన్ గా నటించి ఫరియా అబ్దుల్లా ఈ సినిమాతోనే ఎంతో మంచి పేరు సంపాదించుకుని ఓవ‌ర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. గతంలో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసినా ఫరియా అబ్దుల్లాకి అభిమానుల్లో ఎంతటి క్రేజీ ఫాలోయింగ్ ఉందో అమ్మడు బయట కనిపిస్తే ఫ్యాన్స్ ఇచ్చే రియాక్షన్ లోనే అర్ధమైపోతుంది. అయితే ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చిట్టిని మాత్రం మన డైరెక్టర్లు పట్టించుకోవడం లేదు. జాతి ర‌త్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అమ్మడు కాల్ షీట్లు ఫుల్ అయిపోవాలి కానీ అరా కొరా సినిమాలు గెస్ట్ రోల్ తప్పిసే ఇప్పటి వరకు చెప్పుకొతగ్గా ఆఫర్లు రాలేదు. రీసెంట్ గా బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్ మాత్రమే చేసిన ఈ బ్యూటీకి ఓ స్టార్ డైరెక్టర్ అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చాడట.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఫరియా అబ్దుల్లా దగ్గరకి ఓ అద్దిరిపోయే కధతో స్టార్ డైరెక్టర్ వచ్చి స్టోరి వినిపించాడట. స్టోరీ బాగా నచ్చడంతో అమ్మడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు  టాక్ వినిపిస్తుంది. అయితే ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో మదర్ గా మనకు కనిపించనుందట. ప్రస్తుత సమాజంలో భార్య భర్తలు చిన్న గొడవలే విడాకులు అంటూ పెద్ద పెద్ద డెసీషన్స్ తీసుకుంటున్న నేపధ్యంలో దీనే సినిమా గా తెరకెక్కిస్తున్నాడట ఆ డైరెక్టర్. విడాకులు తీసుకుంటే ఎలా ఉంటుంది..పిల్లలు ఎలా సఫర్ అవుతారు..విడాకులు తీసుకున్న అమ్మాయిని ఈ సమాజం ఎలా చూస్తుంది అనే కీ పాయింట్స్ పై స్టోరీ నడవబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాకి ఫరియా అబ్దుల్లా అయితే హోంలీ  లుక్స్ తో బాగుంటుందని భావించిన డైరెక్టర్ ఆమెకు స్టోరీ వినిపించగా ఆమె కూడా ఇంప్రెస్ అయ్యి..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఈ వార్త మీడియాలో లీక్ అవ్వడంతో ఫరియా అబ్దుల్లా అభిమానులు చిట్టిని ఈ సినిమా విషయంలో మరోసారి ఆలోచించుకో అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. అప్పుడే మదర్ రోల్ లో నటిస్తే నీకు ఇంకా హీరోయిన్ గా ఆఫర్స్ ఇవ్వరు చిట్టీ ఆలోచించుకో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరీ చిట్టీ అభిమానుల మాట విని ఈ సినిమా నుండి తప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: