అయ్యయ్యో అర్జున ఫల్గుణ.. వారం కలక్షన్స్ కోటి దాటాలా..!

shami
శ్రీ విష్ణు, అమృత అయ్యర్ లీడ్ రోల్స్ లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన సినిమా అర్జున ఫల్గుణ. సినిమాను తేజ మార్ని డైరెక్ట్ చేశారు. 2021 చివరి రోజు డిసెంబర్ 31న రిలీజైన ఈ సినిమా ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసినా సినిమాలో విషయం లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అర్జున ఫల్గుణ సినిమా మొదటి షో నుందే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాకే కలక్షన్స్ కష్టంగా ఉన్నాయి. అలాంటిది ఫ్లాప్ టాక్ వస్తే రెండో ఆటకి అంతా ఖాళీనే.
అలానే అర్జున ఫల్గుణ వసూళ్లు దారుణంగా ఉన్నాయి. వారం రోజుల్లో ఈ సినిమా కలక్షన్స్ కోటి దాటలేకపోయాయి. శ్రీ విష్ణు నటించిన లాస్ట్ మూవీ రాజ రాజ చోర సినిమా 6 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. అలాంటిది అర్జున ఫల్గుణ మూవీ వారం రోజుల్లో కేవలం 88 లక్షలు మాత్రమే రాబట్టింది. ఏపీ తెలంగాణాలో 81 లక్షలు కలెక్ట్ చేసిన అర్జున ఫల్గుణ మిగతా ఏరియాల్లో 7 లక్షలు రాబట్టింది. ఫైనల్ గా వరల్డ్ వైడ్ గా అర్జున ఫల్గుణ కేవలం 88 లక్షలని మాత్త్రమే కలెక్ట్ చేసింది.
అర్జున ఫల్గుణ సినిమా 2.5 కోట్ల దాకా బిజినెస్ చేసింది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ ను ఇంకా 1.62 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంటుంది. మొదటివారమే కోటి దాటని ఈ సినిమా రానున్న రోజుల్లో అన్ని కలెక్ట్ చేస్తుంది అంటే నమ్మడం కష్టం. అర్జున ఫల్గుణ సినిమా శ్రీ విష్ణు కెరియర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది. కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తాడని శ్రీ విష్ణుకి మంచి పేరు ఉంది. కానీ ఇలాంటి సినిమాల వల్ల ఆ పేరు పోయేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: