'ఇంద్ర' 5 టికెట్ లను బ్లాక్ లో 10 వేలకు కొన్నారట..

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన ఈ సినిమా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకి దర్శకుడు బి. గోపాల్. ఇక ఈ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ పేరు వినగానే  బాలకృష్ణతో ఆయన చేసిన మాస్ యాక్షన్ సినిమాలు కళ్లముందు కదలాడతాయి. అయితే బాలయ్యతో భారీ ఫ్యాక్షన్ సినిమాలను తెరకెక్కించి భారీ విజయాలను అందించిన ఆయన చిరంజీవితో కూడా 'ఇంద్ర' సినిమా రూపొందించి సంచలన విజయాన్ని నమోదు చేశారు.2002 వ సంవత్సరంలో వచ్చిన 'ఇంద్ర' సినిమా చిరంజీవి కెరియర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. కథ .. మాటలు .. పాటలు ఇంకా డాన్సులు ప్రేక్షకులను చాలా విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఆ సినిమాను గురించిన విషయాలను బి.గోపాల్ ఇప్పుడు గుర్తుచేసుకున్నారు."ఇంద్ర సినిమా ఒక సెన్సేషన్ .. కథా పరంగా  ఇంకా సాంగ్స్ పరంగా అలాగే నాకు బాగా గుర్తుండిపోయే సినిమా అది. చిరంజీవి గారు చాలా అద్భుతంగా నటించేశారు. 'దాయి దాయి దామ్మా' .. 'భం భం బోలే' ఇంకా 'రాధే గోవిందా' ఈ మూడు పాటలు కూడా దేనికదే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇక ఆ పాటలకి ఆయన ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు. 'మొక్కే కదా అని పీకితే పీక కోస్తా' .. ఇంకా 'తప్పు మా వైపు ఉంది గనుక తలవంచుకుని వెళుతున్నా .. లేదంటే తలలు తీసుకుని వెళ్లేవాడిని ' వంటి డైలాగ్స్ ను ఆయన గొప్పగా చెప్పారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి.సాధారణంగా ఒక సినిమాకి బ్లాక్ లో టికెట్ల కోసం 500 .. 600 పెడుతుంటారు. కానీ ఆ రోజుల్లో మోదటి రోజు టిక్కెట్లు దొరక్కపోతే ఒక వ్యక్తి పదివేల రూపాయలు పెట్టి మరి 5 టిక్కెట్లు తీసుకున్నట్టుగా తెలిసింది. అదీ మెగాస్టార్ చిరంజీవిగారికి ఉన్న క్రేజ్ అని బి గోపాల్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: