నిర్మాతపై కేసు వేసిన వాణిశ్రీ.. కారణం తెలుసా?
అయితే కొన్ని దశాబ్దాల కిందట ఎంతమంది నటీమణులు కూడా నిర్మాతలుగా రాణించిన వారు ఉన్నారు. వారిలో విజయలలిత కూడా ఒకరు. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు సినిమాలను కూడా నిర్మించేవారు విజయలలిత. ఈ క్రమంలోనే శోభన్ బాబు వాణిశ్రీ కాంబినేషన్ లో దేవుడు మామయ్య అనే సినిమా తెరకెక్కించారు. విజయలలిత కూడా ఒక పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. 1980 జనవరి 14 వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ అంతలో ఊహించని చిక్కులు వచ్చిపడ్డాయి. ఫైనాన్స్ విషయం సెటిల్ కాకపోవడం.. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సహకారం లేకపోవడం వల్ల దేవుడు మామయ్య చిత్రం విడుదల కాస్త ఆగి పోయింది.
ఈ సినిమాను విడుదల చేసేందుకు విజయలలిత ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. దీంతో దర్శక రత్న దాసరి నారాయణరావును ఆశ్రయించారు నిర్మాత విజయ లలిత. సమస్యను పరిష్కరించి సినిమా విడుదలకు సహాయం చేయాలి అంటూ కోరడంతో దాసరి రంగంలోకి దిగి ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ లతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. దీంతో ఒక సంవత్సరం ఆలస్యంగా 1981 జనవరి 14 వ తేదీన ఈ సినిమా ఆలస్యంగా విడుదల అయింది. ఇక అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో హీరోయిన్ గా నటించిన వాణిశ్రీ షాక్ ఇచ్చింది. తన రెమ్యునరేషన్ విషయంలో నిర్మాత మోసం చేసింది అంటూ కోర్టులో కేసు వేసింది. నాకు రావాల్సిన మొత్తం పారితోషికం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. దీంతో విజయనిర్మల మరోసారి దాసరిని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన దాసరి వాణిశ్రీ తో కేసు వాపసు తీసుకునేలా చేసి విజయలలిత వాణిశ్రీ మధ్య రాజీ కుదిర్చి ఈ విషయాన్ని సెటిల్ చేశారు. ఇక ఈ వివాదం కాస్త అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిందట.