పుష్ప ది రైజ్.. క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ మొదటి సారి పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి అందరి దృష్టిలో పడ్డాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి డీగ్లామర్ పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ సినిమా గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కి.. కొంతవరకు విమర్శల పాలైనా కలెక్షన్ల పరంగా తగ్గేదేలే అన్నట్టుగా జెడ్ స్పీడ్ లో దూసుకుపోతోంది..
ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఐటమ్ సాంగ్ అన్నీ కూడా ఒక ట్రెండ్ ను సెట్ చేశాయి. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల తో పోల్చుకుంటే ఉత్తరాంధ్ర తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేసి ఇండస్ట్రీలో రికార్డు గా నిలిచింది ఈ సినిమా. తమిళనాడు రాష్ట్రంలో కేవలం నాలుగు రోజుల్లోనే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ రికార్డుగా తెలుగోడి సినిమా నిలవడం అదే మొదటిసారి. ఇక కేవలం దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది.
హిందీలో ఏకంగా 100 లొకేషన్లలో హిందీ వెర్షన్ లో ఈరోజు నుంచి విడుదల కానుంది ఈ సినిమా. ఇకపోతే యుఎస్ఎలో ఇప్పటివరకు ఏకంగా 17.9 కోట్ల రూపాయలను వసూలు చేసి ఇండస్ట్రీలో రికార్డు తెలుగోడి సత్తా చూపించాడు. కనీవినీ ఎరుగని రీతిలో అమెరికాలో కూడా ఇలాంటి కలెక్షన్లు రాబట్టడం తో నిర్మాతలు సైతం హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ట్వీట్ కాస్తా బాగా వైరల్ గా మారడంతో పాటు అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.