అబ్బా : ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ గురించి నాగ్ అలా అన్నారేంటబ్బా ... .??

GVK Writings
టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అయిన ఆర్ ఆర్ఆర్, రాధేశ్యామ్ వాస్తవానికి మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మన దేశంలో కరోనా ఓమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో పలు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్స్ లో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ విధించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. దానితో ఈ రెండు సినిమాలను కొన్నాళ్ల పాటు వాయిదా వేశారు. ఇక ఆ సినిమాల కోసం ఎంతో ఆశగా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రేక్షకాభిమానులు అందరిలో కూడా ఒక్కసారిగా నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి.
ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి యాక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించగా రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రభాస్, పూజా హెగ్డే ల కలయికలో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించగా రాధాకృష్ణ కుమార్ దానిని ఎంతో గ్రాండ్ గా తీశారు. ఇక ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు సంక్రాంతి రేస్ నుండి తప్పుకోవడంతో పలు చిన్న సినిమాలు ఆ సమయానికి రిలీజ్ లని ప్రకటించాయి. అలానే ఎప్పటి నుండో సంక్రాంతి బెర్త్ ఖాయం చేసుకున్న నాగార్జున, నాగ చైతన్యల కలయికలో తెరకెక్కుతున్న బంగార్రాజు మూవీ జనవరి 14న పక్కాగా రిలీజ్ అవుతున్నట్లు నేడు హీరో కం నిర్మాత నాగార్జున మీడియా ముఖంగా ప్రకటించారు.

అయితే ఈ సందర్భంగా మీడియాతో నాగార్జున మాట్లాడుతూ, ఆర్ ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు పక్కాగా పండుగకి వచ్చి ఉంటె నిజంగా ప్రేక్షకాభిమానులకి ఎంతో మంచి కన్నుల పండుగగా ఉండేదని, అయితే పరిస్థితులు అనేవి మన చేతుల్లో ఉండవు, అలానే అవి పాన్ ఇండియా మూవీస్ గా ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కడంతో ఈ కరోనా పరిస్థితుల్లో రిలీజ్ చేయలేక దర్శక నిర్మాతలు వాయిదా వేశారని, ఒకరకంగా అది నిజంగా తనకి కూడా బాధగానే ఉందని అన్నారు నాగార్జున. ఇక తమ సినిమా విషయమై యూనిట్ మొత్తం కూడా ఎంతో పక్కాగా కాన్ఫిడెంట్ గా ఉందని తెలిపిన నాగార్జున, ఏపీ టికెట్స్ విషయమై ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఇది రాజకీయ ప్రసంగం కాదని, అయితే ప్రస్తుతం టికెట్ రేట్స్ తమకు అయితే కరెక్ట్ గానే ఉన్నట్లు చెప్పారు. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన బంగార్రాజు మూవీ మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: