పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదేనా?
ఇదంతా ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయనలో ఒక నటుడు, రచయిత, ఫైట్ మాస్టర్, దర్శకుడు ఇలా ఎన్నో కళలు ఉన్నాయి. అయితే అన్ని పవన్ కు ప్లస్ అయ్యాయి, కానీ డైరెక్షన్ మాత్రం ఇప్పటి వరకు ఆయనకు కలిసి రాలేదనే చెప్పాలి. రెండు చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు వహించారు పవన్. అయితే ఆ రెండు కూడా విజయాన్ని అందుకోలేకపోయాయి. పవన్ డైరెక్టర్ గా విజయాన్ని అందుకోవపోవడానికి కొందరు సినీ విశ్లేషకులు ఈ కారణాలు చెబుతుంటారు. మొదటగా చెప్పాలంటే ఒక పనిలో నైపుణ్యం సాధించడానికి అభ్యాసం, సాధన అనేది ఖచ్చితంగా అవసరం.
అలాగే దర్శకుడిగా సక్సెస్ అవ్వాలన్నా కూడా అనుభవం అవసరం. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అనుభవం ఉండాలని అంటారు. అయితే డైరెక్టర్ దాసరి నారాయణ రావు మరియు మెగాస్టార్ చిరు కాంబో లో వచ్చిన లంకేశ్వరుడు చిత్రానికి మాత్రమే గతంలో పవన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారని సమాచారం. అంతే తప్ప వేరే ఏ చిత్రాలకు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయలేదట, ఇలా పెద్దగా డైరెక్షన్ రంగంపై అనుభవం లేకపోవడం ఒకటైతే ... కథను చాలా వరకు చేంజెస్ చేస్తూ ఉండడం లాంటి పలు కారణాల వలన పవన్ డైరెక్టర్ గా హిట్ సాధించలేకపోయారు. మరి చూద్దాం రాబోయే కాలంలో అయినా డైరెక్టర్ గా కనీసం ఒక్క సినిమా అయినా హిట్ కొడతాడా...