'ఆర్ ఆర్ ఆర్' వల్ల ఎన్టీఆర్ కి అన్ని కోట్ల నష్టమా..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఏ పాత్రకైనా నూటికి నూరు శాతం న్యాయం చేసే ఎన్టీఆర్.. ఇప్పటికే ఎన్నో విభిన్న తరహా పాత్రల్లో నటించాడు. అలాంటి పాత్రల కోసం తన లుక్ ని సైతం మార్చుకున్నాడు. ఒకప్పుడు ఎంతో లావుగా ఉండే ఎన్టీఆర్ యమదొంగ సినిమా కోసం ఏకంగా 30 కేజీల బరువు తగ్గి అందరికీ షాకిచ్చాడు. ఇక అప్పటినుంచి పాత్రలకి తగ్గట్టు బరువు తగ్గడం పెరగడం చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ సినిమా విడుదల అయ్యి సుమారు మూడేళ్లు కావస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఒకే ఏడాది రెండు సినిమాలను విడుదల చేసిన రోజులు కూడా ఉన్నాయి.


కానీ ఇప్పుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' కి పరిమితం కావడంతో ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా కూడా గత మూడేళ్లలో విడుదల కాలేదు. అయితే రామ్ చరణ్ మాత్రం రాజమౌళి అనుమతితో ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ తో పాటు శంకర్ సినిమాని కూడా కమిట్ అవ్వడమే కాకుండా రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం త్రిబుల్ ఆర్ కే పరిమితమై కొత్త సినిమాను ఇప్పటివరకు సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. అయితే ఎన్టీఆర్ కనుక త్రిబుల్ ఆర్ సినిమాకి ఓకే చెప్పకపోయి ఉంటే గత మూడేళ్లలో కనీసం మూడు నుంచి నాలుగు సినిమాల్లో నటించేవాడని.. 
వాటికి రెమ్యూనరేషన్ల రూపంలో 150 నుంచి 200 కోట్ల వరకు ఎన్టీఆర్ కి దక్కేదని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.


దీన్ని బట్టి చూస్తే త్రిబుల్ ఆర్ వల్ల ఎన్టీఆర్ కి సుమారు రెండు వందల కోట్ల నష్టం కలిగిందని చెప్పవచ్చు. మరి ఎన్టీఆర్ నాలుగేళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం త్రిబుల్ ఆర్ తో దక్కుతుందేమో చూడాలి. ఇక మరోవైపు అతిత్వరలోనే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా షూటింగ్ మొదలు కానుంది. రివేంజ్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతోంది. ఇక సినిమాలో ఎన్టీఆర్ ని సరికొత్తగా చూపించబోతున్నారు కొరటాల. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తో పాటు మరో నిర్మాత మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: