అందరూ వెనక్కి తగ్గుతున్నా అజిత్ మాత్రం ముందుకు!!
ఈ సినిమా ఒక్కటే కాదు సంక్రాంతి కానుకగా రాబోతున్న మరో సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందన్న వార్తలు ఇప్పుడు తెగ వినిపిస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశపడి ఈ సినిమా చూడాలని భావించగా ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడం అందరిని ఎంతో నిరాశపరుస్తుంది. అయితే టాలీవుడ్ లో పెద్ద హీరోలే తమ సినిమాలను విడుదల చేయడానికి వెనకడుగు వేస్తుంటే తమిళ స్టార్ హీరో మాత్రం తన వాలిమై సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
అజిత్ కు హీరోగా తమిళనాట భారీ క్రేజ్ ఉంది. మధ్య లో అయన కొంత యాక్టివ్ గా లేకున్నా ఆ తర్వాత వరుస భారీ హిట్ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నారు. అలా అజిత్ ఇప్పుడు వాలిమై అనే చిత్రాన్ని భారీ అంచనాలతో చేస్తుండగా ఈ సినిమా సంక్రాంతి కి రావడం తెలుగులో ఉన్న అజిత్ అభిమానులను సైతం ఎంతో ఆనందింపచేస్తుంది. ఈ మేరకు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన బోణీ కపూర్ ఈ విషయాన్నీ అధికారికంగా చెప్ప గా ఈ సినిమా ఏ రేంజ్ లో అభిమానులను అలరిస్తుందో చూడాలి.