షాక్:పూరీకి జీవితాంతం రుణపడి ఉంటానంటున్న థమన్.. కారణం..!!!
పూరీ జగన్నాథ్.. తన సినిమాకు ప్రాణం పోయాలని పవన్ కళ్యాణ్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగి చివరకు బద్రి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా పరిచయం అయ్యారు.. ఇక మొదటి సినిమాతోనే పవన్ కళ్యాణ్ స్టార్ ని అమాంతం పెంచేసిన ఈయన ఆ తర్వాత రవితేజ లాంటి హీరోలకు స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించి పెట్టాడు. ఇక ప్రస్తుతం రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ను కూడా లైగర్ సినిమాతో తన దర్శకత్వంలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చేలా చేస్తున్నారు..
ఇకపోతే తాజాగా ఎస్.ఎస్.థమన్ తన ట్విట్టర్ ద్వారా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ చిత్రంలో నుంచి సారొస్తారొస్తారా అనే పాటను థియేటర్లో వస్తున్నప్పుడు ప్రేక్షకులు చేసే కోలాహలంను ఒక వీడియో రూపంలో షేర్ చేశాడు. అంతే కాదు నా జీవితంలో నాకు ఇష్టమైన దూకుడు సినిమా తర్వాత అంతే స్థాయిలో నాకు నచ్చిన సినిమా బిజినెస్ మాన్. ఇక ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు పూరి జగన్నాథ్ జీవితాంతం రుణపడి ఉంటాను. సారొస్తారొస్తారా అనే ఈ పాట నా లైఫ్ లోనే బెస్ట్ సాంగ్ అని థమన్ తెలపగా ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది.