కృష్ణవంశీ కి ఆ హీరోయిన్ కి మధ్య ఏం జరిగింది
అలాంటి దర్శకుడైన కృష్ణవంశీ ఇప్పుడు తన సినిమాలతో పెద్దగా ఆలరించించడం లేదనే చెప్పాలి. కానీ ఒకప్పుడు ఆయన తీసే సినిమాలకు ఎదురే లేదు. అలాంటి కృష్ణవంశీ తన కెరీర్లో ఎప్పుడూ కూడా ఎవరితో ఎలాంటి విభేదాలు పెట్టుకోలేదు. ఆయన పర్సనల్ లైఫ్ లో కొంత వివాదం నడిచిన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎవరితోనూ విభేదాలు పెట్టుకోలేదు. కానీ ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన దాని ప్రకారం ఓ హీరోయిన్ తనకు అసలు ఎలాంటి బాండింగ్ ఏర్పడలేదని ఆమె కేవలం నటించడానికి మాత్రమే వచ్చిందని దగ్గరయ్యే పనులు ఎలాంటివి చేయలేదని అంత ప్రొఫెషనల్ యాక్టర్ ను తాను తన కెరీర్లో ఎప్పుడూ చూడలేదని కృష్ణవంశీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజానికి ఒక సినిమాకు పని చేస్తే ప్రతి ఒక్కరూ ఎంతో క్లోజ్ అవుతూ ఉంటారు. వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా వారి మధ్య ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అలాంటిది హీరోయిన్ ఇలియానా తనకు ఏ మాత్రం క్లోజ్ కాకపోవడం, కృష్ణవంశీ అది చెప్పడం అప్పట్లో కొంత వివాదంగా మారింది. ఎన్టీఆర్ సరసన కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించిన రాఖీ సినిమా లో ఇలియానా నటించింది. ఈ సినిమా లో సెట్ లోకి వచ్చి తన పని తాను చూసుకుని వెళ్ళిపోయేదట ఇలియానా. నార్మల్ గా ఈ సినిమా గురించి తప్ప ఒక్క మాట కూడా ఆమె ఎవరితోనూ మాట్లాడలేక పోయేదట. దాంతో ఆమెను ప్రొఫెషనల్ యాక్టర్ గా సంబోధిస్తూ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.