కన్నడ హీరో యష్ ఒక్కసారిగా కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ సినిమాతో అంతులేని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఈయన. ఈ సినిమా ఆయన కెరియర్ను ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఎస్ హీరోగా చేసిన కే జి ఎఫ్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఇక కేజిఎఫ్ సినిమా తో దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ పేరు మరియు హీరో అయినా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ సత్తా ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న దాని కంటే పెద్ద విజయం అందుకోవడం తో కే జి ఎఫ్ చాప్టర్ 2 కూడా తెరకెక్కించనున్నాడు ఈయన.
ఇక వీరి అభిమానులు అయితే ఈ సినిమా సీక్వెల్ ను కూడా చూసేందుకు ఎంతో ఉత్సాహపడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. ఇక ఎస్ హీరోగా తెరకెక్కనున్న కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా లో వింటేజ్ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేసారని తెలుస్తుంది. అయితే బాలీవుడ్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలిసి నటించిన షోలే సినిమా లోని మెహబూబా.. మెహబూబా.. పాటని రీమిక్స్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ పాటలో ఏ నటి త్వరలోనే మనందరికీ తెలియనుంది.
అయితే ఈ పాట కేవలం హిందీ లోనే ఉంటుందా లేక వేరే భాషల్లో కూడా ఉంటుందన్న విషయం మాత్రం ఇప్పటికీ తెలియలేదు. ఇక ఈ సినిమాలో చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. ఇక ఈ సినిమా కోలార్ బంగారు గనుల నేపథ్యంలో మాఫియా కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.మరి ఇన్ని అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ సినిమా అనుకున్న విజయం సాధిస్తుందో లేదో చూడాలి...!!