తెలుగు దర్శకులు.. తమిళ హీరోలు.. రొంబ కాంబినేషన్ అప్ప..!!

Anilkumar
సినిమా ఇండస్ట్రీలో ఇంతకాలం మన తెలుగు హీరోలు తమిళ దర్శకుల వెంట పడేవారు. అయితే తమిళ హీరోలు తెలుగు దర్శకులతో చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. అప్పట్లో కమలహాసన్ తో కె.విశ్వనాథ్ లాంటి లెజెండరీ దర్శకుడు సినిమా చేశాడు. ఆయన తర్వాత బాలచందర్, బాలు మహేంద్ర లాంటి దర్శకులే తెలుగు హీరోలతో సినిమాలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు అలా లేవు. తెలుగు దర్శకులు అందరూ కలిసి తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎందుకంటే మన దర్శకులు చెబుతున్న కథలకు అవతలివారు ఫిదా అవుతున్నారు. అనేక మంది హీరోలు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీ పై పడుతున్నారు. 


ఇంతకుముందు డబ్బింగ్ సినిమాలు చేస్తున్న తమిళ హీరోలు ఇప్పుడు స్ట్రెయిట్ సినిమాలు చేయడం జరుగుతుంది. అయితే  తాజాగా ధనుష్‌, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో సినిమా కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈయన తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్దే  వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో సార్ అనే సినిమా రాబోతుంది. ఇక ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమాకి మరో నిర్మాతగా త్రివిక్రమ్ భార్య చేయడం విశేషం. అంతేకాకుండా శివ కార్తికేయన్ కూడా తెలుగు దర్శకుడితో సినిమా చేయనున్నాడట.


అయితే అంతటితో ఒక సినిమా మా చేయబోతున్నాడట ఈయన. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇక 2023 లో విజయ్, వంశీ పైడిపల్లి సినిమా కూడా రానుంది. ఈ సినిమా కోసం కోలీవుడ్ హీరో విజయ్ ఏకంగా వందకోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తమిళ హీరోలు కాకుండా ఎంతో మంది తమిళ హీరోలు తెలుగు దర్శకులతో కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి తమిళంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళు తెలుగు సినిమాలు చేసి ఇక్కడ కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: